Body Heat: ఒంట్లో వేడి తగ్గాలంటే ఇలా చేయండి..
శరీరంలోని అతివేడి కారణంగా ఎన్నోసమస్యలు వస్తుంటాయి. ఎండాకాలంలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. మసాల కూరలు ఎక్కువగా తీసుకోవడం, నీటిని తక్కువగా తీసుకోవడం, గంటలతరబడి
కూర్చొని పనిచేయడం వలన శరీరంలో వేడి పెరుగుతుంది. అయితే ఈ వేడిని మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అతి సులభంగా తగ్గించుకోవడం ఎలానో తెలుసుకుందాం..
గ్లాస్ నీటిలో కొద్దిగా జిలకర, చెంచా కలకండ (పటిక బెల్లం)ను వేసి రెండు గంటలపాటు నానబెట్టిన తర్వాత తీసుకోవడం వలన శరీరంలో వేడిన బాగా తగ్గిస్తుంది.

రోజులో రెండు నుంచి మూడుసార్లు మజ్జిగతో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వలన కూడా శరీరంలో వేడిని తగ్గించవచ్చు.
మూడు లేదా నాలుగు చెంచాల సబ్జా గింజలను తీసుకొని వాటికి కొంచెం నిమ్మరసం కలిపి నాలుగు గంటలపాటు నానబెట్టిన అనంతరం తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని తగ్గించవచ్చు.
గ్లాస్ వాటర్‌లో ఒకస్పూన్ తేనెను కలిపి రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే తీసుకోవడం వేడి కురుపులు తగ్గిపోతాయి.
నీటిని ఎక్కువగా తీసుకోవడం, కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల కూడా శరీరంలో వేడిని తగ్గించవచ్చు.