Today Horoscope: 24 ఫిబ్రవరి2021 రాశి ఫలాలు
Today Horoscope 24 February 2021: జ్యోతిషశాస్త్రాన్ని భారతీయు ప్రజలు ఎంతగానో విశ్వసిస్తారు. ఈ జ్యోతిషసాస్త్రం తో గ్రహాల కదలికలు, జాతకంపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. రాశిచక్రంలో 12 రాశులు ఉంటాయి. మానవుల పుట్టుక ఆధారంగా వారు ఏ రాశిలో జన్మించారో లెక్కిస్తాను. తమ భవిష్యత్తు లో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతివారిలోను ఉంటుంది. వాటిని ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు మనకు ఎంతో తోడ్పడుతాయి.

మేష రాశి (Aries ) (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ రాశివారికి పని ఒత్తిడి కాస్త పెరుగుతుంది. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు పరవాలేదు. వివాహ ప్రయత్నాలు జయిస్తాయి .
వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఆరోగ్యానికి ఏమాత్రం లోటు లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఈ రోజు కనబడుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయం సాధిస్తారు.
మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
మీరు చేసే పనిలో ఆదాయం బాగుంటుంది. ఎక్కువ శ్రమతో పనులు పూర్తవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో జరగకపోచ్చు.
కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశి వారు ఉద్యోగ విషయంలో మంచి విషయం వింటారు. ఫలితంగా ఆదాయం వృద్దిచెంది రుణాలు తీరుస్తారు. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులు ఎక్కువగా కష్టపడితే ఫలితం బాగుంటుంది.
సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వీరు శుభకార్యం చేసే అవకాశం ఉంది. ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది. తలచిన పనులు జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది. చాలావరకు రుణ బాధలు తప్పుతాయి. ప్రేమ లు ఫలిస్తాయి.
కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వీరికి వ్యాపార విషయాల్లో , అదేవిదంగా స్వయం ఉపాధి రంగాల వారికి ఈ రోజు బాగుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వీరికి డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉంటాయి. స్థాన చలన సూచనలు ఉన్నాయి. బంధువులతో విభేదిస్తారు. కొత్త ఫ్లాట్ కొనడానికి సన్నాహాలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల విజయం దక్కుతుంది. వివాహ సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగుతారు.
వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
ఈ రాశివారికి ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి కుదిరే అవకాశం మెండుగా ఉంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. ప్రేమ వ్యవహారాలు కొంతవరకు బాగుంటాయి.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వీరికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిదంగా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు చెవిన పడుతాయి. బంధువుల రాకపోకలు కొనసాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ లో విజయం దక్కుతుంది.
మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఈ రాశివారికి పెళ్లి ప్రయత్నాలకు ఆటంకం జరుగుతుంది. వ్యాపారులకు సమయం బాగుంది. తన సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది.
కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ రాశివారికి ఉద్యోగంలో పైస్థాయికి వెళ్లే అవకాశం లభిస్తుంది. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం వస్తుంది. శుభవార్త వింటారు. ఉద్యోగంలో శ్రమ ఎక్కువవుతుది. ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి. విద్యార్థుకు ఈ రోజు బాగుంది.
మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
ఈ రాశివారికి ఆర్థిక, వ్యాపార రంగాలవారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. భాగస్వాములతో విభేదాలు తగ్గుముఖం పడుతాయి. రుణాలు తీరుస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు పొందుతారు. ఆదాయం పరవాలేదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు నెరవేరుతాయి.