Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 18, 2021
Today Horoscope In Telugu 18 February 2021: జ్యోతిషశాస్త్రాన్ని భారతీయు ప్రజలు ఎంతగానో విశ్వసిస్తారు. ఈ జ్యోతిషసాస్త్రం తో గ్రహాల కదలికలు, జాతకంపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. రాశిచక్రంలో 12 రాశులు ఉంటాయి. మానవుల పుట్టుక ఆధారంగా వారు ఏ రాశిలో జన్మించారో లెక్కిస్తాను. తమ భవిష్యత్తు లో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతివారిలోను ఉంటుంది. వాటిని ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు మనకు ఎంతో తోడ్పడుతాయి.

మేష రాశి (Aries ) (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఒక పద్దతి ప్రకారం ప్రణాళిక వేసుకొని ముందుకు సాగుతారు. కచ్చితమైన సమయస్ఫూర్తి పాటించి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం అందుకుంటారు. ఇంట్లో బయటా కాస్త ఒత్తిడి పరమైన ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య పరంగా, ఆదాయం పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
వృషభ రాశి (Taurus ) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఈ రోజు కుటుంబ సమస్యలనుండి బయటపడతారు. దాంపత్య జీవితం సుకంగా సాగుతుంది. వ్యాపారం అభివృద్ధి కొనసాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా బాగుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు జరిపి విజయం సాధిస్తారు.
మిథున రాశి (Gemini ) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయ మార్గాలు బాగుంటాయి. అలాగే ఖర్చు పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులుకు విజయం వరిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
కర్కాటక రాశి (Cancer ) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగపరంగా వృద్ధి సాధిస్తారు. ఆదాయం పెరిగి, రుణాలు తీరుస్తారు. వివాహ సంబంధం కుదురుతుంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త చెవిన పడుతుంది. ఆర్థిక లావాదేవీలకు సమయం అనుకూలంగా లేదు.
సింహ రాశి (Leo ) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
డబ్బు పరంగా లాభాలు చేకూరుతాయి. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోండి. వాహన యోగం ఉంది. సమయం అనుకూలంగా ఉంది. తలచిన పనులు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలుల ఫలిస్తాయి. పిల్లల్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది. కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
కన్య రాశి (Virgo ) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ పరంగాను, ఉద్యోగపరంగాను మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు.
తులా రాశి (Libra ) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్థాన చలన సూచనలున్నాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవచ్చు. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది.
వృశ్చిక రాశి (Scorpio ) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీ ఉండవద్దు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొద్దిగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి.
ధనస్సు రాశి (Sagittarius ) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఒక విశేష శుభం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.
మకరం (Capricorn ) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
శ్రమ మీద పనులు కొన్ని పూర్తి చేస్తారు. బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారులకు సమయం అనుకూంగా ఉంది. ఉన్న ఊళ్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడి గల వారితో పరిచయాలలు ఏర్పడతాయి. మిత్రుల సహాయంతో కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తారు.
కుంభ రాశి (Aquarius ) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
శని సంచారం కారణంగా మధ్య మధ్య స్వల్ప అనారోగ్య, అనవసర ఖర్చులు సంభవిస్తాయి. ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది. ఆర్థిక, వ్యాపార రంగాల వారికి బాగుంది. భాగస్వాముతో విభేదాలు తలెత్తవచ్చు. రుణాలు తీరుస్తారు. ఆదాయం పరవా లేదు. ఇంట్లో శుభం జరుగుతుంది.
మీన రాశి (Pices ) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల ద్వారా ఉపకారం జరుగుతుంది. ముఖ్య కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు సంపాదిస్తారు.