Today Hot and short news – 27 june 2020

భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్లో తూర్పు గోదావరి కి చెందిన ఓ మహిళ ప్రసవించింది, తను కవలపిల్లలకి జన్మనివ్వగా వైద్యులు చనిపోయారంటూ ఒక కవరులో పెట్టి ఇచ్చారు , తర్వాత పిల్లలు కదలటం తో దగ్గర ఉన్న అపోలో హాస్పిటల్ కి తరలించారు.
ఈ మధ్యన టీవీ నటుడు ప్రభాకర్ కి కరోన సోకిందని వైరల్ ఐన విషయం తెలిసిందే అయితే తనకి నెగెటివ్ రావటం తో టీవీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది,ఇక జాగర్తలు పాటిస్తూ మల్లి షూటింగ్స్ యధావిధిగా సాగే అవకాశాలున్నాయి.
బిగ్ బాస్ షో హోస్టుగా గా సమంతని పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇదే నిజమైతే బిగ్ బాస్ చరిత్రలో మహిళా హోస్ట్ చేయటం ప్రప్రథమం అవుతుంది , మొదటి మూడు సీజన్స్ దేనికదే బెటర్ అనిపించుకోగా నాలుగో సీజన్ పైన సర్వత్రా ఆసక్తి మొదలైనట్టునుగా కనబడుతుంది .
తెలుగు ప్రజల ముఖ్యం గా తెలంగాణ జిల్లా కరీంనగర్ జిల్లాకి చెందిన పీవీ నర్సింహారావు జయంతి ఈరోజు , ఈ జయంతి ఉత్సవాలని ఎవరు పట్టించుకోవటం బాధాకరం , కాగా తనకి భారతరత్న ఇవ్వాలని సర్వత్రా వినబడుతుంది .
ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని విద్యాధికారి ఎస్ వి దుర్గాప్రసాద్ తెలిపారు .
ఏపీ లో భారీగా పెరిగిన కరోనా , 24 గంటల్లో మొత్తం 796 పాసిటివ్ కేసులు నమోదయ్యాయి , దీంతో మొత్తం 12,285 కి చేరింది , కాగా 5840 మంది కోలుకున్నారు .
ఇకనుండి MI ఫోన్ అంటే మేడ్ ఇన్ ఇండియా అని షియోమీ సంస్థ తెలిపింది , దీనికి కారణం చైనా బ్రాండ్ షాపులపైనా దాడులు జరగటమే .
ఇండియాలో భయపెడుతున్న కరోనా లెక్కలు
మే 18 – 1,00,509,
జూన్ 2 – 2,07,335(15రోజుల వ్యవధి ),
జూన్ 12 – 3,09,231(10రోజుల వ్యవధి ),
జూన్ 20, 4,11,629(8రోజుల వ్యవధి ),
జూన్ 26, 5,08,952(7రోజుల వ్యవధి ).
.