టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. ముంబైలో ఆ హీరోయిన్ అరెస్ట్..
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో.. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ వివాదం.. శాండల్ వుడ్ కి పాకీ.. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కలకలం రేపుతోంది. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ ని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాలొకి వెళితే…ముంబై మీరా రోడ్డు సమీపంలో ఉన్న హోటల్‌లో డ్రగ్స్ రాకెట్ దందా నడుపుతుందనే సమాచారంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ టాలీవుడ్ హీరోయిన్ తో పాటు..చాంద్ అనే వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేశారు. వీరి దగ్గరి నుండి 10 లక్షలు విలువ చేసే 400 గ్రాముల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కానీ డ్రగ్స్ సరఫరాలో మెయిన్ సప్లయిర్ అయిన సాయిద్ ఇంకా పరారీలోనే ఉన్నట్టు సమాచారం.

ఇప్పటికే బాలీవుడ్ లో రియా చక్రవర్తి, దీపిక పదుకొనే, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ వివాదంలో భాగంగా పోలీసులు విచారణ జరిపారు. ఆలాగే కన్నడలో హీరోయిన్ లు సంజన, రాగిణి ద్వివేది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అదే విధానంగా ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ డ్రగ్స్ కేసులో పట్టుబడంతో.. ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో చర్చంశనియంగా మారింది.