health tips in telugu
రక్తహీనతను దూరం చేసే పవర్‌ఫుల్ ఫుడ్స్..
రక్త హీనత అనేది శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వలన వచ్చే వ్యాధి. బలవర్ధకమైన ఆహారం తీసుకోకపోవడం, ఐరన్ లోపం వల్ల వస్తుంది. రక్తహీనత ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లలలో వస్తూ ఉంటుంది. శరీరంలో హీమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోతే రక్తహీనతతో బాధపతున్నట్లు లెక్క.

రక్తహీనత సమస్య వలన త్వరగా నీరసపడిపోవడం, మగతగా ఉండటం, ఎక్కువగా పనిచేయలేకపోవడం, తలనొప్పి, చిరాకు, బరువు తగ్గడం, శ్వాసను తక్కువగా తీసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యకు పరిష్కారం ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు: అంజీర్, ఖర్జూరపు పండ్లు, దానిమ్మ, పాలకూర, గ్రీన్‌పీస్, గుమ్మడి విత్తనాలు, క్యాబేజీ, మాంసం, గుడ్లు, సోయాబీన్స్, తేనె, బీట్‌రూట్, టమాట.