వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనాన్ని పెంచే ఉసిరి..
ఉసిరిని తులసితో సమానంగా పూజిస్తాం. ఉసిరి పుణ్యాన్నే కాదు.. ఎన్నో రుచులను మరెన్నో ఆరోగ్య లాభాలను తనలో దాచుకుంది. ప్రయోజనాలను పరిశీలిస్తే..
ముసలితనాన్ని వాయిదా వేద్దాం అనుకునేవారికి ఉసిరిని మించిన ఫలం ఇంకొకటి లేదు.
సీ విటమిన్ అధికంగా ఉండటంతో పాటు అనేక వ్యాధులకు నివారిణిగా పనిచేస్తుంది. ఇందులో ఎక్కువ మోతాదులో సి, ఇంకా ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి.

జుట్టు ఒత్తుగా పెరగడానాకి: ఉసిరిపొడి, నిమ్మరసాన్ని తలకు పట్టించి పావుగంట తర్వాత తలస్నానం చేయడం వలన జుట్టు బలంగా పెరుగుతుంది. అలాగే నల్లటి జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.
కడుపులో మంటకు: రాత్రి భోజనం అనంతరం ఒక స్ఫూన్ ఉసిరి పొడిలో తేనెను కలిపి తీసుకుంటే ఎసిడిటి లేదా కడుపు మంట నుంచి శాశ్వతంగా తప్పించుకోవచ్చు.
గుండె జబ్బులకు: శరీరానికి నూతన శక్తిని ఇవ్వడం ద్వారా గుండెకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడం ద్వారా గుండెను కాపాడుతుంది.
ఉసిరి షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. కంటిచూపును మెరుగుపరచడంలోనూ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహకరిస్తుంది. ఇన్ని సుగుణాలు గల ఉసిరిని తీసుకుందాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.