Today Telugu News Updates
పోకెట్ పే.. లంచాలకు పాల్పడుతున్న ట్రాఫిక్ పోలీస్ !

మహారాష్ట్రలోని పిపిరీలో ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారులను తనిఖీ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ ట్రాఫిక్ పోలీసు నిబంధనలు పాటించని మరో యువతితో బేరసారాలు జరిపింది.
ఆ మహిళను విడిచిపెట్టేందుకు కొంత మొత్తాన్ని ఇవ్వాలని కోరింది. ఆ మొత్తానికి ఒప్పుకున్నా ఆ మహిళ దగ్గరినుండి నేరుగా తీసుకోకుండా వెనుక పాకెట్లో డబ్బును పెట్టమని తెలిపింది.
ఇలా ట్రాఫిక్ నిబంధనలు పాంటించకపోవడంతో ట్రాఫిక్ పోలీసుల జేబులు నిండుతున్నాయి. చలనా రాస్తే.. చాలా ఎక్కువ చెల్లిచాల్సి వస్తుంది. అదే నేను అడిగిన మొత్తం ఇస్తే చలానా బాధనుండి తప్పుకోవచ్చు అని ఉచిత సలహాలు ఇస్తూ లంచాలకు పాల్పడుతున్నారు.
ఇలా స్వాతి అనే ట్రాఫిక్ పోలీస్ లంచాలు తీసుకుంటుండగా ఎవరో క్లిక్ మనిపించి షోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.