Trivikram Srinivas stood up with his Promise : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?:-

Trivikram Srinivas stood up with his Promise : మాటల మాంత్రికుడు ఎవరికీ అంత సులభంగా మాట ఇయ్యడు ఒకవేళ ఇస్తే మాట మీద కచ్చితంగా నిలబడే మనిషి. అసలు త్రివిక్రమ్ గారు ఎవరికీ మాట ఇచ్చారని అనుకుంటున్నారా. ఇచ్చారండి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాట ఇచ్చారు. ఆలస్యం ఎందుకు కానీ మ్యాటర్ లోకి వెళ్దాం.
సుశాంత్ హీరో గా తీసిన చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. అయితే ఈ సినిమా కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ గారు తన తదుపరి చేసే సినిమాలలో కచ్చితంగా మీనాక్షి ని తీసుకుంటాను అని చెప్పకనే చెప్పారు కాదు మాట ఇచ్చారు.
ఇపుడు త్రివిక్రమ్ ఆ మాట మీద నిలబడ్డారు. మెయిన్ మ్యాటర్ లోకి వెళ్తే త్రివిక్రమ్ తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఉండబోతుందని అధికారిక ప్రకటన ఎప్పుడో జరిగింది. మహేష్ చేయబోయే సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ చివరి దశలోకి రావడంతో మహేష్ కూడా త్రివిక్రమ్ తో చేసే సినిమా పైన ఫోకస్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో మెయిన్ హీరోయినిగా పూజ హెగ్డే అని చిత్ర బృందమే చెప్పింది. కాకపోతే త్రివిక్రమ్ గారి సినిమాలలో ఎపుడు వచ్చే ఆనవాయితీ ఇపుడు కంటిన్యూ చేస్తున్నారు. అదే త్రివిక్రమ్ సినిమాలలో ఇద్దరు హీరోయిన్లు ఉండడం.
మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే ఉండగా సెకండ్ హీరోయిన్ గా మహేష్ బాబు సరసన మీనాక్షి ని ఫిక్స్ చేసినట్లు చిత్రసీమ లో టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా రెండవ సినిమాతోనే మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకుంది మీనాక్షి. ఈ విషయం పై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఎపుడు క్లారిటీ ఇస్తారో వేచి చూడక తప్పదు. త్రివిక్రమ్ మహేష్ సినిమా షూటింగ్ జవనరి లో మొదలవనుంది.