Uma Bigg Boss 5 age, Husband, Bio

Uma Devi: ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ అర్ధపావు భాగ్యం అని అంటే ప్రజలందరూ సులువుగా గుర్తుపటేస్తారు. సొంతపేరు కన్నా సీరియల్స్ లో తాను నటించిన పాత్రల పేర్లే ఎక్కువ గుర్తుండిపోయేలా ఉంటాయి. అంతలా పాత్రలో జీవిస్తారు ఉమాదేవి.
అయితే Uma Devi పుట్టింది , పెరిగింది మాత్రం హైదరాబాద్ తెలంగాణ లోనే. చిన్నపటినుంచి సినిమా మీద ఆశక్తితో చదువు పక్కన పెట్టేసి సినీ జీవితం పై అడుగులు వేసింది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురుకున్నారు.
అయితే తాను కన్నా కల మొదటిసారి 2004 లో సారీ ఆంటీ అనే సినిమా ద్వారా నెరవేరింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన శివమణి , ఇడియట్ తో ఎక్కువ ప్రజాధారణ పొందింది. ఆలా వరుసగా మంచి సినిమాలో విభిన్న పాత్రలు చేస్తూ ప్రజలను ఎప్పటికి అప్పుడు అలరిస్తూనే ఉంది.
అయితే సినీ రంగంలో కూడా తాను కన్నా కల ఎక్కువ కాలం ఉండలేకపోయింది. అందుకని సినిమా ఆఫర్లు రాక బాధపడకుండా వెంటనే సీరియల్ రంగం లో ప్రవేశించింది. సీరియల్స్ లో ప్రయత్నించినా వెంటనే భార్య భర్త అనే సీరియల్ లో ఆఫర్ రావడం మరల లైఫ్ బిజీ అయిపోవడం జరిగింది.
ఇలా వరుస సీరియల్ ఆఫర్లతో లైఫ్ హ్యాపీ గా లీడ్ చేస్తుంది. కల్యాణ వైభోగం , వరూధిని పరిణయం మరియు కార్తీకదీపం లో అర్ధపావు భాగ్యం. ఇలా ఉమాదేవి ప్రజలను అలరిస్తూనే ఉంది.
ఇదిలా ఉండగా ఉమాదేవి చిన్నవయసులోనే పెళ్లి చేసుకుంది. Uma Devi కి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. కానీ భర్త తో దూరం ఉంటుంది. పిల్లలు పుట్టకముందే ఉమాదేవి భర్తతో వేరయింది. పిల్లలు పుట్టారు , బాధ్యతలు పెరిగాయి ఎలాగైనా తండ్రి ప్రేమ పిల్లలకి కావాలని ఉమాదేవి వెళ్లి తన భర్తను రిక్వెస్ట్ చేసిన భర్త వినిపించుకోలేదు. ఆలా దాంపత్య జీవితం లో ఉమాదేవి భర్త లేకుండా కష్టపడుతూ , తన పాత్రలతో ప్రజలని నవ్విస్తూ , తన ఇద్దరు పిల్లలనీ పెంచి పెద్ద చేసింది.
ఇపుడు ఉమాదేవి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పోటీ చేస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది.
Name:- Uma Devi
ముద్దు పేరు :- Uma
డేట్ ఆఫ్ బర్త్ :- 1980
Age :- 41 సంవత్సరాలు
ఎత్తు మరియు పొడవు :- 5 అడుగుల 6 అంగుళాలు
లొకేషన్ :- నర్సీపట్నం, విశాఖపట్నం , ఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుత నివాసం :- హైదరాబాద్, తెలంగాణ
ఇష్టమైన రంగు :- యెల్లో, బ్లాక్
ఇష్టమైన నటుడు :- చిరంజీవి
ఇష్టమైన నటి :- రమ్యకృష్ణ
ఇష్టమైన ఆహారం :- సౌత్ ఇండియన్ ఫుడ్
హాబీస్ :- డాన్సింగ్ , ట్రావెలింగ్.
మొదటి సినిమా :- సారి ఆంటీ
మొదటి సీరియల్ :- వరూధిని పరిణయం
ఫేమస్ పాత్ర :- అర్ధపావు భాగ్యం ( కార్తీక దీపం )