ఉమామహేశ్వర ఉగ్రరూపస్య 2020

Uma maheswara ugra roopasya movie review :: సినిమా :- ఉమామహేశ్వర ఉగ్రరూపస్య (2020)
నటీనటులు :- సత్యదేవ్ , హరి చందన
మ్యూజిక్ డైరెక్టర్:- బిజిబాల్
నిర్మాతలు :- ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ
డైరెక్టర్ :- వెంకటేష్ మాహా
C/o కంచరపాలెం సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ మహా తన రెండవ చిత్రం సత్యదేవ్ తో మలయాళం సూపర్ హిట్ సినిమా మహిషిన్తే ప్రతీకారంని తెలుగులో ఉమామహేశ్వర ఉగ్రరూపస్యగా ప్రేక్షకుల ముందుకి తెచ్చారు. ఈ సినిమా తెలుగు ప్రజలకి ఎలాంటి అనుభూతినిచ్చిందో ఇపుడు మనం తెలుసుకుందాం.
కథ :-
ఈ కథ ఒక విశాలమైన ఊరిలో మహేష్(సత్యదేవ్) పెళ్లిళ్ళ ఫోటోలు , ప్రకృతి ఫోటోలు తీసుకుంటూ తన తండ్రితో గడిపే జీవితంతో మొదలవుతుంది. మహేష్ కి చిన్న ఫోటో స్టూడియో ఉంటుంది. మహేష్ కి కొందరు స్నేహితులు ఉంటారు. ఎప్పుడూ ఫోటోలు తీయడమే తన జీవితం అనుకుంటాడు. అలాగే తన తండ్రి నుండి ఫోటో యొక్క విలువల్ని తెలుసుకుంటాడు. అలా కొద్ది రోజులు గడవగా ఊరి నుండి తన చిన్ననాటి ప్రేయసి(హరి చందన) వస్తుంది. మహేష్ చిన్ననాటి నుండి ఆమెను ప్రేమిస్తుంటాడు. అలా వారి ఇరువురి ప్రేమ సాఫీగా సాగుతున్న సమయంలో ఊరిలో మహేష్ స్నేహితులకి, లోకల్ రౌడీకి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవ తగ్గించడానికి మహేష్ ప్రయత్నిస్తే అతనిని తీవ్రంగా కొడతారు. మహేష్ వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు ? ఈ గొడవలకు అతని ప్రేమ ఏం అవుతుంది? అసలు గొడవలు ఎందుకు జరిగాయి ? మహేష్ ఎవరి పైన పగ తీర్చుకోవాలి అని అనుకుంటాడు ? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెట్ ఫ్లిక్స్ లో సినిమా చూడాల్సిందే మరి.
👍
* సత్య దేవ్ తన ప్రతి సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ సినిమాలో అతని నటనతో ఇంకో మెట్టు ఎక్కేశాడు.
* సత్య దేవ్ మరియు చందనల కెమిస్ర్టీ చక్కగా కుదిరింది.
* దర్శకుడు వెంకటేశ్ మాహా ఎక్కడా బోర్ కోట్టనీయకుండా రీమేక్ చక్కగా చేశాడు.
*పాటలు వినసొంపుగా మరియు గుర్తుండిపోయేలా ఉన్నాయి.
*సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
* ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.
* ఎడిటింగ్ కూడా బాగా చేశారు.
👎
* చిత్ర కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుంది.
ముగింపు :-
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా రీమేక్ చిత్రమే అయినా డైరెక్టర్ వెంకటేష్ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీసి ప్రేక్షకాదరణ పొందాడు. సత్య దేవ్ తన పాత్రలో ఒదిగిపోయి పాత్రకి న్యాయం చేశాడు. సత్యదేవ్, హరిచందన మధ్య వచ్చే సన్నివేశాలు చూడముచ్చటగా ఉన్నాయి. పాటలు మరియు వాటి చిత్రీకరణ బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మొత్తానికి ఈ సినిమా ద్వారా సత్యదేవ్ తన ఉగ్ర రూపాన్ని చూపించి ఒక మెట్టు పైకి ఎక్కాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాని మీరు నెట్ ఫ్లిక్స్ ద్వారా చూడచ్చు.
రేటింగ్ :- 3/5