Tollywood news in telugu

శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ వనవాసం చిత్రం అక్టోబర్ 25న విడుదల !!!

*శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ వనవాసం చిత్రం అక్టోబర్ 25న విడుదల !!!*

నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం “వనవాసం”. భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వం లో
శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెం: 1 సంజయ్ కుమార్. బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ “భారత్ కుమార్ .పి” మాట్లాడుతూ..
కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ని తీయడం జరిగింది. ఈ ట్రైలర్ లాగానే సినిమా కూడా మీ అందరూ మెచ్చే విధంగా
ఉంటుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

నిర్మాత “సంజయ్ కుమార్ . బీ” మాట్లాడుతూ..
సినిమా మేము అనుకున్న దానికంటే చాల అద్భుతంగా తెరకు ఏకించారు అక్టోబర్ 25న ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధం గా ఉన్నాం అని నిర్మాత “సంజయ్ కుమార్. బీ” చెప్పారు.

హీరో నవీన్ రాజ్ శంకరాపు మాట్లాడుతూ..
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ గారికి
ఎపటికి రుణపడి ఉంటాన్ను ఇంకా మా కోసం కష్టపడిన మా టీం అందరి కోసం అయినా మంచి ఫలితం
వస్తుంది అని నముతున్న మా ఈ ప్రయత్నాని మీరంతా చూసి మమ్మలిని ఆశీర్వదిస్తారు. అక్టోబర్ 25న మీ ముందుకు వస్తున్న మా వనవాసం టీం కి మీ అందరి ఆశిర్వధం కావాలి అని అన్నారు.

పి.ఆర్.ఒ: “మధు వి.ఆర్” సంగీతం “ఎం.ఎం.కుమార్”, సినిమాటోగ్రఫీ “ప్రేమ్ జై విన్స్Oట్ ”
ఎడిటర్ “ప్రభు”
పోస్టర్స్ మరియు ట్రైలర్ “నాగ విజయ్ కుమార్.ఎం”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button