Today Telugu News Updates
Viral: పెళ్లి కారటపై క్యూఆర్ కోడ్.. ఐడియా అదుర్స్

మనం ఎన్నో పెళ్లి పత్రికలు చూస్తుంటాం ..ఆన్లైన్లో పత్రికలను పంపించడం కూడా చూస్తుంటాం. అందులో కొందరు ప్రాంతీయ భాషలో రాసిన పత్రికను కూడా చూస్తూ ఉంటాం.. కానీ మీరు ఎప్పుడైనా క్యూఆర్ కోడ్ ఉన్న పత్రికను చూశారా?

తమిళనాడు రాష్ట్రంలోని మధురై లో ఓ పెళ్ళి కూతురి తల్లిదండ్రులు తమ కూతురి వివాహ ఆహ్వాన పత్రిక వినూత్నంగా రూపొందించుకున్నారు. కరోనా దృష్ట్యా ఎవరు వేడుకలకు హాజరు కావడం లేదు..అలాగే వేడుకకు వచ్చిన కట్నం ఇవ్వాలంటే సందేహిస్తున్నారు.

దీంతో వారు పెళ్లి పత్రిక పై క్యూఆర్ కోడ్ ని ఏర్పాటు చేశారు. ఎవరైనా నూతన వధూవరులకు కానుకలను ఫోన్ పే గూగుల్ పే క్యూఆర్ కోడ్ ద్వారా పంపే అవకాశాన్ని కల్పించారు. ఈ వివాహ వేడుక ఆదివారం జరిగింది. ప్రస్తుతం ఈ వెరైటీ పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది