మొఖం పచ్చడి చేస్తానంటున్న వరుణ్
తన మొదటి సినిమా నుండి విభిన్న కథాంశాలతో, పాత్రలతో జనాలను ఆకట్టుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి మొఖం పచ్చడి చేస్తానంటున్నాడు ఇక వివరాల్లోకి వెళితే .
తన గత చిత్రాలు అంతరిక్షం,ఎఫ్ టు భారీ విజయాలు అందుకోవడం తో ఈసారి వరుణ్ తేజ్ జోనర్ మార్చాలనుకున్నాడు.అందుకే కొత్త దర్శకుడైన కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించబోతున్నాడాట.దర్శకుడు కిరణ్ కొర్రపాటి గతంలో వరుణ్ తేజ్ నటించిన మిస్టర్ మరియు తొలిప్రేమ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు.ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ బ్రదర్ బాబి నిర్మించబోతున్నట్లు తాజా సమాచారం.
రొటీన్ కి భిన్నంగా కథాంశాలను పాత్రలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి బాక్సర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.ఈ చిత్రంలో వరుణ్ తేజ్ గురువుగా అర్జున్ నటించబోతున్నట్లు సమాచారం మిగతా వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.