Tollywood news in telugu
varun tej : కరోనా బారినపడ్డ హీరో వరుణ్ తేజ్ !

మెగా కుటుంబంలో మరో హీరో కరోనా బారిన పడ్డారు. హీరో వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ విషయాన్ని వరుణ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాస్త కరోనా లక్షణాలు కనబడటంతో అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకోగా కరోనా సోకినట్లు వరుణ్ తెలిపారు.
ప్రస్తుతం వరుణ్ హోం క్వారంటైన్‌లో ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని తెలిపాడు. ఇక తనపై ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసాడు వరుణ్ .