Venky Following Chiru Strategy : చిరంజీవి బాటలో నడుస్తున్న వెంకీ మామ :-

Venky Following Chiru Strategy : ఎందుకో ఏమో పెద్ద హీరోలందరూ రీమేక్స్ పైన మోజు చూపిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి అనౌన్స్ చేసిన సినిమాలలో రెండు రీమేక్స్ ఉన్నాయి.
అయితే ఇపుడు విక్టరీ వెంకటేష్ కూడా అదే బాటలో నడుస్తున్నారు.
అపుడెపుడో దృశ్యం తో రీమేక్ చేశారు. తెలుగు లో ఘాన విజయం సాధించింది. మళ్ళీ ఇన్నెలకి తమిళ్ లో హిట్ అయినా అసురన్ సినిమా ని నారప్ప గా తీసి ఓటీటీ బ్లాక్ బస్టర్ దక్కించుకున్నారు వెంకటేష్. అయితే రీమేక్స్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నాయని రీమేక్స్ ఏ చేయాలనీ ఫిక్స్ అయినట్లు ఉన్నారు.
ఇదివరకే వెంకటేష్ గారు స్పానిష్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ చూడడం జరిగింది. అవి వెంకటేష్ కి ఎంతగానో నచ్చడం తో ఆ స్పానిష్ కంటెంట్స్ ని రీమేక్స్ చేయాలనీ ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా వెంకటేష్ బ్రదర్ అయినా సురేష్ బాబు నిర్మాత. వీరిదగ్గర స్పానిష్ సినిమా మరియు వెబ్ సిరీస్ రైట్స్ ఎప్పటినుంచో ఉన్నయాని తెలుస్తుంది. కాబట్టి వెంకటేష్ స్పానిష్ కంటెంట్స్ పై ఆశక్తి చుపియడంతో త్వరలో ఈ ఆలోచనని అమలు చేయనున్నారు. ఈ ఫిలిం లేదా సిరీస్ ని సురేష్ బాబు కానీ నెట్ ఫ్లిక్ వారు కానీ నిర్మించబోయే అవకాశాలు ఉన్నాయి. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. చూడాలి మరి ఈసారి వెంకీ మామ ఏ రీమేక్ తో ప్రజల ముందుకు రాబోతున్నారో.