Tollywood news in telugu
Vidyut Jammwal Kalaripattu: కలరిపట్టుతో అదరగొడుతున్న విద్యుజమ్మాల్ !

ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ విద్యుజమ్మాల్ అటు బాలీవుడ్ ప్రేక్షకులను, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. తెలుగులో ఎన్ టి ఆర్ తో ‘శక్తి’, ‘ఊసరవెల్లి’, అదేవిదంగా తమిళ్ లో విజయ్,మురుగదాస్ కాంబినేషన్ లో ‘తుపాకీ’ సినిమాలో విలన్ పాత్రలలో నటించి మంచి ఫిట్నెస్ ఉన్న విలన్ గా పేరు తెచ్చుకున్నాడు.
అంతేకాకుండా సూర్య హీరోగా నటించిన ‘సికిందర్’ మూవీ లో సెంకండ్ హీరోగా చేసాడు. ఇతను సినిమాలకోసం మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రావిణ్యం సంపాదించుకున్నాడు.
ఇక ఇపుడు తాజాగా ఒక పురాతన కలరిపట్టు అనే విద్య నేర్చుకొని అద్భుతమైన ప్రదర్శనను తన షోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇపుడు ఈ వీడియో చుసిన తన అభిమానులు నువ్వు విలన్ కాదు ఒక రియల్ హీరో అని కామెంట్స్ పెడుతున్నారు.