Tollywood news in telugu
రాజకీయ ప్రవేశం చేయనున్న హీరో విశాల్ !

తమిళ సినీ హీరో విశాల్ పొలిటికల్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. జయలలిత మరణం తరవాత ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేసాడు.
కానీ నామినేషన్ ను మద్దతుగా నిలిచినా వారిలో కొందరు మద్దతు ను ఉపసంహరించుకోవడంతో, విశాల్ నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు తాజాగా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ సిద్దమయ్యాడు.
విశాల్ చెన్నైలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశం ఉంది. ఈ విషయానికి సంబంధించి తన అభిమాన సంఘాల నేతలతో చర్చలు జరుగుతున్నాయి. అయితే విశాల్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతాడో వేచిచూడాలి.