vivaha bhojanambu Movie Review : వివాహ భోజనంబు మూవీ రివ్యూ తెలుగులో

vivaha bhojanambu Movie Review And Rating : సినిమా :- వివాహ భోజనంబు (2021) నటీనటులు:- సత్య, ఆర్జవీ రాజ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, TNR, శివన్నారాయణ మరియు సందీప్ కిషన్, నిర్మాతలు:- కెఎస్ సినిష్ మరియు సందీప్ కిషన్, దర్శకుడు:- రామ్ అబ్బరాజు, సంగీత దర్శకుడు:- మణి కందన్
లాక్ డౌన్ సమయం లో ప్రజలకి ఓటీటీ ద్వారా విడుదలయే సినిమాలు అలరిస్తూ వస్తున్నాయి. ఇపుడు సత్య నటించిన వివాహ భోజనంబు సినిమా అదే తరహా లో ప్రేక్షకులని అలరించడానికి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇపుడు మనం చూద్దాం.
కథ :-
ఈ కథ హైదరాబాద్ లో మహేష్ ( సత్య ) LIC ఏజెంట్ గా మరియు మధ్య తరగతి అబ్బాయిగా చూపిస్తూ మొదలవుతుంది. డబ్బు విషయంలో చాల అంటే చాల జాగ్రత్తగా వ్యవహరించే వ్యక్తి. కాలానుసారం అనిత ( ఆర్జవీ రాజ్ ) ని చూసి ప్రేమలో పడుతాడు. అనిత చాల రిచ్ ఫామిలీ నుంచి వచ్చిన అమ్మాయి , అమ్మాయి వాలా నాన్న అయినా శ్రీకాంత్ అయ్యంగార్ కి ఇష్టం లేకపోయినా ఏవేవో మాటలు చెప్పి పెళ్ళికి ఒపించుకుంటారు. అలా శాస్త్రం ప్రకారం పెళ్లి బాధ్యతలు అంత పెళ్ళికొడుకు అయినా మహేష్ పైనే పడటం తో అతి కష్టం మీద ఒప్పుకొని పెళ్లి పనులు ప్రారంభం కాగా, చుట్టాలు అందరు వచ్చేస్తారు. ఇదేసమయం లో కోవిడ్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ మొదలయింది. ఇలాంటి సమయం లో మహేష్ ఎం చేయబోతున్నాడు? అసలు మహేష్ అనిత ఎం చేపి శ్రీకాంత్ ని ఒప్పించారు? మహేష్ ఎం చేయబోతున్నాడు ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా సోనీ లివ్ లో చూడాల్సిందే.
👍🏻:-
- కథ.
- సత్య చాలా బాగా నటించాడు.ఆర్జీవీ రాజ్ కూడా బాగా నటించింది. శ్రీకాంత్ అయ్యేంగర్ గురించి చెప్పనక్కర్లేదు.
- దర్శకుడు పర్వలేదు అనిపించుకున్నడు .
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
- సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
👎🏻:-
- లాజిక్ లేని సన్నివేశాలే ఎక్కువ ఉన్నాయి.
- క్యారెక్టర్ లు సరిగా డిజైన్ చేయలేకపోయారు.
- ముగింపు సరిగ్గా లేదు.
ముగింపు :-
మొత్తానికి వివాహ భోజనంబు అనే సినిమా చాల మటుకు ప్రజలను ఆకర్షిస్తుంది. కానీ సీన్స్ మరియు క్యారెక్టర్ లు సర్రిగా లేకపోవడం తో ప్రజలను నిరాశపరుస్తుంది. సత్య తన నటన తో ప్రేక్షకులని అలరిస్తాడు. బోర్ సన్నివేశాలు ఎక్కువ ఉండటం తో విసుగు తెపిస్తుంది. పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి . నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. దర్శకుడు చుపించాలనుకున్నది చూపించాడు కానీ అనవసరపు సన్నివేశాలు ఎక్కువ పెట్టాడు. మొత్తానికి వివాహ భోజనంబు అనే సినిమా పర్వాలేదు అనిపిస్తది. ఈ వారం కుటుంబం తో కలిసి ఓసారి ఈ సినిమాని చూసేయచ్చు.
Rating:- 2.25/5