Today Telugu News Updates
బండిసంజయ్ హైదరాబాద్ వాసులకు వరాల జల్లులు !

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ జీహెచ్ఎంసి ఎన్నికలే లక్ష్యంగా హైదరాబాద్ వాసులకు వరాల జల్లులు కురిపించారు. టి ఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజలకు బిజెపి చేయబోయే మేలును తెలుపుతూ బండి సంజయ్ ప్రచారం కొనసాగిస్తున్నారు.
టిఆర్ఎస్ పార్టీ వరద సహాయాన్ని 10 వేయిల రూపాయలు ప్రజలకు అందిస్తుంది మరి అంత డబ్బును ఎలా ఖర్చుపెట్టాలో ప్రజలకు అర్థం కావడంలేదని ప్రభుత్వాన్ని వెటకారంగా సంజయ్ అన్నాడు.
మల్లి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మిమ్మల్ని మోసంచేస్తూనే ఉంటుందని తెలిపాడు.
ఎన్నికల్లో బిజెపి కి ఓటు వేసి గెలిపిస్తే మీకు జరిగిన నష్టాన్ని లెక్కకట్టి మరి మీకు నష్టపరిహారాన్ని అందిస్తుందని వరద బాధితులకు బండి సంజయ్ మీడియా సమక్షంలో తెలిపారు.