Today Telugu News Updates

నరేంద్రమోడీ పర్యటనలో జరిగిన అంశాలు ఏంటి !

What happened during Narendra Modi's visit?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన విజయవంతంగా ముగిసింది. జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ క్యాంపస్‌ను మోడీ సందర్శించడం జరిగింది. గంటకి పైగా  శాస్త్రవేత్తలతో సమావేశమై కొవాగ్జిన్ (Covaxin) వాక్సిన్ అభివృద్ధి ఎలా జరుగుతుందో స్వయంగా పరిశీలించాడు. ఇలా  వాక్సిన్ అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలకు ఆయన ప్రశంశించారు. తరవాత  వాక్సిన్ పురోగతికి సంబంధించి  మోదీకి శాస్త్రవేత్తలు తెలియజేసారు.

 భారత్ బయోటెక్ క్యాంపస్ సందర్శన అనంతరం, మోడీ  హకీంపేట నుంచి నేరుగా పుణెకు వెళ్లిపోయారు.

మనదేశంలో మూడు వాక్సిన్‌లు ప్రస్తుతం మూడో దశ కు చేరుకున్నాయి.  హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ (Bharat biotech) కంపెనీ కొవాక్జిన్ (Covaxin), అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ క్యాడిల్లా కంపెనీ జైకోవ్-డీ (ZyCoV-D) వాక్సిన్‌ను, ఇక పుణెకు చెందిన సీరస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రజెనికా-ఆక్స్‌ఫర్డ్ ( AstraZeneca-Oxford) వాక్సిన్‌ను తయారు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ముందుగా  అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిల్లా సెంటర్‌ని సందర్శించిన మోడీ ,తరవాత హైదరాబాద్ వచ్చి భారత్ బయోటెక్ క్యాంపస్‌ను సందర్శించారు. అనంతరం పుణెకు బయలుదేరి  సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button