Today Telugu News Updates
వాట్సాప్ ఆప్ లో చేసే చాటింగ్ కి రక్షణ ఉందా?

WhatsApp Chatting Leak: బాలీవుడ్ నటుడు శుశాంత్ సింగ్ రాజ్ పుత్ యొక్క కేసు ఎన్నో మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ కేసులో డ్రగ్స్ కి సంబంధించి ఒకరి తరవాత ఒకరు బయట పడుతూనే ఉన్నారు.
బాలీవుడ్, టాలీవుడ్ అని తేడాలేకుండా కొత్తగా దీపికా పదుకొనె,శ్రద్దా కపూర్,రకుల్ ప్రీతీ సింగ్, పేర్లతో పాటు వారి మేనేజర్ లు కూడా ఈ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని అనుమానాలకు తెరలేపాయి.
డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా శుశాంత్ ప్రియురాలు రియా యొక్క వాట్సాప్ మెస్సేజ్ లు బయట పడటంతో వాట్సాప్ చాటింగ్ చేయడం సేఫ్ ఆ కాదా అనే అనుమానం ప్రజలలో మొదలైంది.
వాట్సాప్ మాత్రం యూజర్లకు మీ యొక్క అన్ని సందేశాలు గోప్యాంగా ఉంటాయని తెలియజేసింది.