Today Telugu News Updates
Viral: పడవలో మహిళల నృత్యం… ఇంతలోనే పడవ…
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పడవలో మహిళలు నృత్యం చేస్తూ ఉండగా.. పడవ బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న వారిలో ఒక మహిళ నీట మునిగి మృతి చెందింది.

పూర్తి వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ఖర్గోన్ జిల్లా కేంద్రంలోని నావ్‌ఘాట్ ఖెడీలో నర్మదా నదిలో పూజలు చేసేందుకు 11 మంది పడవలో బయలుదేరారు. ఈ మేరకు పడవలో మహిళాలు నృత్యం చేయగా… పడవ అదుపుతప్పి బోల్తా పడింది.

దీంతో పడవలో ఉన్న 11 మంది నీటలో పడ్డారు. ఈ మేరకు ఒక మహిళ నీటలో మునగడంతో మృతిచెందగా.. మరొకరు గల్లంతయ్యారు. మిగతా 9 మందిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.