Tollywood news in telugu
akshay kumar:అక్షయ్ కుమార్ దీపావళి కానుకగా ‘రామ్ సేతు’ ఫస్ట్ లుక్

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అందరి హీరోలతో పోల్చితే ఎంతో బిన్నంగా ఉంటాడు. ఈ గడ్డుకాలంలో కూడా చేతి నిండా సినిమాలతో అక్షయ్ఎంతో బిజీగా ఉన్నారు . ఇప్పటికే ఆయన నటించిన బెల్‌బాటమ్‌లు, లక్ష్మి విడుదల కాగా,ఈ క్రమంలో అక్షయ్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించి తన అభిమానులకు దీపావళి కానుకగా అందించాడు.
అక్షయ్ నటించబోయే ‘రామ్ సేతు’ ఫస్ట్‌లుక్‌ను దీపావళి కానుకగా సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ పోస్టలో అక్షయ్ మెడలో ఎరుపు కండువాతో కార్గ్ ప్యాంట్, షర్ట్ ధరించి ఎంతో గ్లామర్ గా కనిపించాడు.
అదేవిదంగా అతడి వెనకలో శ్రీరాముడి షాడో ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
శ్రీరాముడి ఆదర్శాలను సజీవంగా ఉంచడానికి ప్రయత్నిద్దామని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ‘రామ్ సేతు’ తో త్వరలో మీ ముందుకు వస్తానని తెలిపాడు.